telugu navyamedia
సినిమా వార్తలు

ఖాన్ త్రయం ఒకే సినిమాలో…!

Khans

బాలీవుడ్‌ ఖాన్ త్రయం ఆమిర్‌ఖాన్‌, షారూక్‌ఖాన్‌, స‌ల్మాన్‌ఖాన్ కొన్ని సంవ‌త్స‌రాలుగా బాక్సాఫీస్ వ‌ద్ద స‌త్తా చాటుతున్నారు. ఈ ముగ్గురిలో ఇద్ద‌రిద్ద‌రే వెండితెర‌పై న‌టించి ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. కానీ ఈ ముగ్గురు స్టార్స్ ఎప్పుడూ వెండితెర‌పై న‌టించ‌లేదు. లేటెస్ట్ బాలీవుడ్ స‌మాచారం మేర‌కు ఈ ఖాన్ త్రయం ఓ సినిమాలో న‌టించ‌బోతున్నార‌ట‌. వివ‌రాల ప్ర‌కారం ఆమిర్‌ఖాన్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న చిత్రం `లాల్ సింగ్ చ‌ద్దా`. ఈ చిత్రంలో ఆమిర్‌తో పాటు షారూక్‌, సల్మాన్ కూడా న‌టిస్తార‌ట‌. హాలీవుడ్ చిత్రం `ఫారెస్ట్ గంప్‌` చిత్రానికి ఇది రీమేక్‌. అద్వైత్ చంద‌న్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవల షారుఖ్ ఖాన్ కు సంబంధించిన ఓ ఫోటోను సల్మాన్ ఖాన్ షేర్ చేయగా… అది వైరల్ అయిన విషయం తెలిసిందే.

Related posts