telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నువ్వు నీ కోసం బతుకు..

నువ్వు చచ్చాక నిన్ను ‘శవం’ అనే అంటారు.
‘ఆ శవాన్ని ఇటు తీసుకురండి
ఆ శవాన్ని కింద పడుకోబెట్టండి’ అనే అంటారు.. నువ్వు బతికినప్పుడు ఎవరి గురించి ఆలోచిస్తూ… నీ సంతోషాలని,
నీ ఆనందాలని దూరం చేసుకున్నావో అదే జనాలు,
నువ్వు చచ్చిన మరు క్షణం నుంచే నిన్ను పేరుతో పిలవటం మర్చిపోతారు.
ఆ రోజు నువ్వో ‘శవం’. కాల్చినాక గంట కూడా నీ కోసం ఎవరూ ఉండరక్కడ.
నిన్ను పూడ్చిన పది నిమిషాలు కూడా ఎవరూ నీ కోసం వెయిట్ చేయరు.
అందుకే…
నువ్వు నీ కోసం బతుకు..
నీలా బతుకు..
నీకిష్టమొచ్చినట్టు బతుకు..
నిజమే చెప్పు…
ఇష్టముంటే అవునను..
లేదంటే కాదను.
నీకేం చేయాలనిపిస్తే అదే చెయ్.
నీ జీవితం
నీ ఇష్టం..
నీ లక్ష్యం..
నీ ఆశయం…
నీ జీవితం… అంతే !

Related posts