telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

2020లో యంగ్ హీరో ప్రేమ వివాహం…?

Nithin

యంగ్ హీరో నితిన్ ప్ర‌స్తుతం భీష్మ అనే సినిమాతో పాటు చంద్రశేఖర్‌ ఏలేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు నితిన్ . ర‌కుల్‌, ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి చ‌ద‌రంగం అనే టైటిల్ పెట్టాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. కాగా, నితిన్ తనతో ఛల్‌ మోహన్‌ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలోను నితిన్ సినిమా చేయ‌నున్నాడు. మ‌రోవైపువెంకీ అట్లూరి దర్శకత్వంలో ‘రంగ్ దే’ అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే టాలీవుడ్‌లో ప్ర‌స్తుతం ఓ ఆస‌క్తిక‌ర వార్త చ‌క్క‌ర్లు కొడుతుంది. ల‌వ‌ర్‌ బోయ్ నితిన్ వ‌చ్చే ఏడాది ఏప్రిల్‌లో ప్రేమ వివాహం చేసుకోనున్నాడ‌ట‌. నితిన్ చేసుకోబోయే అమ్మాయి సినిమా ప‌రిశ్ర‌మ‌కి సంబంధించిన అమ్మాయికాద‌ని అంటున్నారు.త‌ను ఒప్పుకున్న ప్రాజెక్టులు పూర్తైన త‌ర్వాత నితిన్ పెళ్లి పీట‌లు ఎక్క‌డం ఖాయం అని టాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. దీనిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

Related posts