telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

బిగ్‌ బ్రేకింగ్‌ : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు రద్దు

Nimmagadda ramesh

ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ వివాదాలు ముదురుతున్నాయి. స్థానిక సంస్థలు ఎన్నికలతో వైసీపీ, టీడీపీ ల మరోసారి రాజకీయాలు భగ్గుమన్నాయి. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌కు దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఏపీ స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను ఏపీ హైకోర్టు సస్పెండ్ చేసింది. ఎస్‌ఈసీ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించిన ఏపీ సర్కార్‌…కేసు విచారించిన హైకోర్టు పంచాయతీ ఎన్నికలపై ఎస్‌ఈసీ నోటిఫికేషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తాజా తీర్పుతో ఇప్పట్లో ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టేనని స్పష్టం అయింది. ప్రజారోగ్యం, వ్యాక్సిన్‌ పంపిణీని దృష్టిలో పెట్టుకుని హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. వ్యాక్సినేషన్‌కు ఎన్నికల ప్రక్రియ అడ్డురాకూడదని కోర్టు నిర్ణయం తీసుకుంది. కాగా… ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలకు ఎస్‌ఈసీ షెడ్యూల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌ను అధికార వైసీపీతో సహా, ఏపీ ఉద్యోగ సంఘాలు కూడా వ్యతిరేకించాయి.

Related posts