స్టార్ హీరోయిన్ పూజా హిగ్దే వరుస సినిమాలతో బిజీ అయింది. ఈ అమ్మడి గ్రామర్‌కు కుర్రకారు గుడి కడుతున్నారు. దాంతో నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మను ప్రిఫర్ చేస్తున్నారు. ప్రస్తుతం పూజా చేతిలో మంచి ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ సినిమాలో చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో పాటుగా అఖిల్ అక్కినేని హీరోగా చేస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోనూ నటిస్తోంది. వీటితో పాటుగా మధ్యలో బాలీవుడ్‌లోను మెరవనుంది. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ చేస్తున్న ‘కబీ ఈద్ కబీ దివాళి’ సినిమాలో కనిపించనుంది. అంతేకాకుండా రన్‌వీర్ సింగ్, రోహిత్‌తో కలిసి క్రికస్ అనే సినిమాలో చేస్తుంది. అంతేకాకుండా తమిళంలోనూ దుల్కర్ సల్మాన్‌తో కలిసి ఓ సినిమా చేయనుంది. ఇది ఇలా ఉండగా.. పూజా హెగ్డేకు మరో బంపర్ ఆఫర్ వచ్చినట్లు టాక్ నడుస్తోంది. మాస్టర్ సినిమా తర్వాత తమిళ స్టార్ హీరో విజయ్ చేస్తున్న సినిమాలో ఈ పుట్టబొమ్మ ఛాన్స్ కొట్టేసిందట. ఇప్పటికే పూజతో దర్శకుడు నెల్సన్ సంప్రదింపులు జరిపాడట. దీనికి సానుకూలంగానే స్పందించిందట పూజ. అయితే.. దీనిపై తర్వలోనే క్లారిటీ రానుంది.
previous post
next post