telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

బంగారం ప్రియులకు అదిరిపోయే శుభవార్త..పడిపోయిన ధరలు

బులియన్‌ మార్కెట్‌లో వారం రోజులుగా తగ్గిన బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే తాజాగా అటు ఢిల్లీ, ఇటు హైదరాబాద్‌లోనూ బంగారం, వెండి ధరలు బాగా పడిపోయాయి. ఢిల్లీలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర మాత్రం రూ. 170 తగ్గి రూ. 48,050 పలుకుతోంది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 44,050 వద్ద ఉంది. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ స్థిరంగా రికార్డు అయ్యాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 180 తగ్గి రూ. 45,700 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 150 తగ్గి రూ. 41,900 పలుకుతోంది. బంగారం ధర తగ్గగా.. వెండి ధర మాత్రం పెరిగింది. కిలో వెండి ధర రూ.400 పెరిగి రూ.70,400 వద్ద కొనసాగుతోంది.

Related posts