telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

ప్రతి రోజూ ఈ పండ్లను తినండి… ఏ డాక్టర్ అవసరం లేదు

* అరటిపండు –
అరటిపండులో పొటాషియం , మాంసకృత్తులు ఎక్కువుగా ఉండటం వలన ఇది తీసుకోగానే నీరసం , వికారం తగ్గి ఉత్సాహం వస్తుంది. గుండె పనితీరు క్రమబద్దం అవుతుంది. ఒక పెద్ద అరటిపండు తింటే 150 కేలరీల శక్తి వస్తుంది. అరటిపండు తినడం వలన జీర్ణశక్తి పనితీరు కూడా మెరుగవుతుంది. గుండెనొప్పి నివారించవచ్చు. రక్తహీనతతో బాధపడేవారు అరటిపండు తింటే ఇందులో ఐరన్ ఉండటం వలన హిమోగ్లోబిన్ శాతం పెరుగును .
* మామిడిపండు –
మామిడిపండు శరీరపుష్టిని కలిగించును. వేగముగా శక్తిని ప్రసాదించును. మామిడిపళ్ళలో A , B , C , D విటమిన్లు కూడా ఉన్నాయి. మామిడి పండ్లలో ఉండే కెరొటిన్ శరీరంలో చేరాక విటమిన్ A గా మారును . మామిడికాయలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది. రెండింటిని తినడం వలన ఐరన్ , విటమిన్ C లను పొందవచ్చు. ఇతర ఖనిజ లవణాలు మాత్రం మామిడికాయ , మామిడిపండు రెండింటిలోనూ సమపాళ్లలో ఉంటాయి.
* సీతాఫలం –
శీతాకాలం ప్రారంభంలో కడుపులో నులిపురుగులు ప్రవేశించడానికి అవకాశం ఉంది. ఈ సీజన్లోనే సీతాఫలాలు లభిస్తాయి. ఇవి తీసుకోవడం వలన నులిపురుగులు పోతాయి . సీతాఫలాలు కడుపులోని క్రిములను బయటకు నెట్టివేస్తుంటే సీతాఫలాలు తినటం వలన పురుగులు వచ్చాయి అనుకుంటాము. ఇది కేవలం భ్రమ మాత్రమే . సీతాఫలానికి జ్వరాన్ని తగ్గించే గుణం ఉన్నది. సీతాఫలం వ్యాధినిరోధక శక్తిని పెంచే గుణం ఉన్నది. రక్తవిరేచనాలకు ఇది మంచి మందుగా పనిచేస్తుంది .
* దానిమ్మ పండు. –
రక్తహీనతతో బాధపడేవారు రోజూ దానిమ్మపండు తినడంగాని లేదా దానిమ్మపండు రసం తాగడం గాని చేయాలి . ఆహారాన్ని జీర్ణం చేయడంలో దానిమ్మ ఒక ఔషధముగా పనిచేయును . అంతేకాకుండా కీళ్లనొప్పులు , ఉబ్బసం , కఫాలను పోగొట్టును . శరీరంలో మంట, జ్వరం , గుండెజబ్బులు , గొంతుకు సంబంధించిన సమస్యలకు ఇది చాలా మంచిది . అరుగుదల సరిగా లేనివారు దానిమ్మని తినటం అలవర్చుకోవాలి.

Related posts