telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

మూడు రాజధానులపై హైకోర్టులో విచారణ

ap high court

మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుకు వ్యతిరేకంగా అమరావతి ప్రాంతానికి చెందిన 37మంది రైతులు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్లపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈ రోజు విచారణ జరిగింది. కాసేపు వాదోపవాదాలు జరిగిన తర్వాత విచారణను ఫిబ్రవరి 26కి హైకోర్టు వాయిదా వేసింది.

ఇక ఈ పిటిషన్లకున్న ప్రాధాన్యత దృష్ట్యా ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. నేటి విచారణలో భాగంగా బిల్లు ప్రస్తుతం ఏ స్థితిలో ఉందని ప్రధాన న్యాయమూర్తి అడ్వకోట్ జనరల్ ను అడిగారు. దీనికి ఆయన సమాధానమిస్తూ.. బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొంది మండలికి వెళ్లిందని, అక్కడ బిల్లును సెలెక్ట్ కమిటీకి నివేదించారని తెలిపారు.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం విచారణ అవసరం లేదని ప్రధాన న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. అయితే, పిటిషనర్ల తరపు న్యాయవాది కలుగజేసుకుని, విచారణ జరగకపోతే.. ప్రధాన కార్యాలయాలను తరలిస్తారని పేర్కొన్నారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. విచారణ పూర్తయ్యేలోపు కార్యాలయాలు తరలిస్తే అందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. కోర్టు నిర్ణయం వచ్చే వరకు ఈ కేసుల్లో ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Related posts