telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

జీవితం ఒక నీటిబుడగ

జీవితం నీటిబుడగని తెలుసు
ప్రేమ బంధం మనసు చేసేమాయని తెలిసి
అణుక్షణం తపించేహృదయం
ఏ క్షణమాగిపోతుందో తెలీనిబ్రమలో
ఎదురుచూపులో కాలంగడుస్తుంది
తనువు మనసునిలకడలేనిదై
నిన్ను ఉరకలు పెట్టిస్తుంటే
కలతచెందిన ప్రాణమా
నీకు దిగులెందుకు
కాలం ఒడిలో హాయిగా కరిగిపో…
……………………………………
మనసా నీకెందుకే అంత ఆశ…ఈ జీవితం శాశ్వతమనుకున్నావా..?
నీవులేని లోకం కనుమరుగౌతుందా…?
ఒంటరిగావున్నా తోడుతో ఉన్నా నీవుమాత్రమే వెళ్తావు దేహాన్ని వదిలి….నీఅనే వారు
నీకు ప్ర్రాణం ఉన్నంత వరకే అని తెలుసుకో …గడిచిన కాలంలో మంచిచెడులు
నీకు జ్ఞపకాలు మాత్రమే వాటినుండి నీకు ఏమి రావు …నీదేహమే నీతోరానపుడు ఇవన్నీ వస్తాయా ….

Related posts