దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. ఆయన ఛాతీలో అసౌక్యంగా ఉందని చెప్పడంతో ఢిల్లీ ఆర్మీ ఆస్పత్రిలో… చికిత్స నిమిత్తం చేర్పించారు. అయితే.. ఆయన ఆరోగ్యంపై తాజాగా ఆస్పత్రి వైద్యులు బులిటెన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఆయనను అబ్జర్వేషన్లో ఉంచామని వైద్యులు ఆ బులిటెన్‌లో తెలిపారు. ఛాతీలో నొప్పి రావడం వల్ల.. ఆయన శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడ్డారని వైద్యులు పేర్కొన్నారు. ఆయనను త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామని వైద్యులు ప్రకటించారు. కాగా.. రామ్‌నాథ్ కోవింద్ మార్చి 3వ తారీఖున, మార్చి 8న ఆయన సతీమణి కరోనా టీకా వేయించుకున్నారు. అయితే..రాష్ట్రపతి రామ్‌నాథ్ టీకా వేయించుకుని దాదాపు ఇరవై రోజులు గడిచిపోయినందున దానికి, ఈ స్వల్ప అస్వస్థతకు సంబంధం లేకపోవచ్చని వైద్యులు భావిస్తున్నారు.

