telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

రామ్ నెక్స్ట్ బాబీ దర్శకత్వంలో…?

Red

‘ఇస్మార్ట్ శంకర్’ తో బ్లాక్ బస్టర్ అందుకున్న రామ్ ప్రస్తుతం ‘రెడ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమ‌ల తెర‌కెక్కిస్తున్నాడు. ఆ తరువాత రామ్ దర్శకుడు బాబీ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడనే వార్తలు విన్పిస్తున్నాయి. ఇప్పటికే బాబీ ఆయనకి ఓ కథ చెప్పాడట. ఫుల్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునే విధంగా ఉండటంతో రామ్ కూడా సై అన్నాడట. ‘వెంకీ మామ’ లాంటి సక్సెస్ తరువాత బాబీ చేయబోతోన్న చిత్రం రామ్ దే కావటం విశేషం. కాకపోతే ఈ మధ్యే పవన్ కళ్యాణ్ కు బాబీ ఓ కథ చెప్పబోతున్నాడని ప్రచారం జరిగింది. కోన వెంకట్ తో కలసి బాబీ సిద్ధం చేసిన ఆ స్టోరీ ఏమైనట్టు? రామ్ కు వినిపించింది అదే స్క్రిప్టా? అవునంటున్నారు కొందరు. పవర్ స్టార్ కు సేమ్ స్టోరీ వినిపించగా ఆయన ఏమంత స్పందించలేదట! వెంటనే రామ్ తో ఆ కథని బాబీ ఓకే చేయించుకున్నాడని ఫిల్మ్ నగర్ గాసిప్. మరి వీళ్ళ కాంబినేషన్ ఎలా ఉండబోతుందో చూడాలి.

Related posts