రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రేపు శ్రీవారి దర్శనార్థం కోసం తిరుమలకు వస్తున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, కలేక్టర్ భరత్ గుప్తా. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో ఘాట్ రోడ్డులో భధ్రతను కట్టుదిట్టం చేసారు పోలీసులు. కల్వర్టుల వద్ద బాంబ్ స్క్వాడ్ తనిఖీలు చెప్పటారు. రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లను పూర్తి చేశాం అని చైర్మన్ వైవి సుబ్బారెడ్డి తెలిపారు. కోవిడ్ నిభందనలు అనుసరించి రాష్ట్రపతి పర్యటనకు ఏర్పాట్లు చేశాం అన్నారు. అయితే రేపు రాష్ట్రపతికీ స్వాగతం పలికేందుకు గవర్నర్ విశ్వభూషణ్ హరిచంద్ తిరుపతి రానున్నారు. రాష్ట్రపతితో పాటు శ్రీవారిని దర్శించుకోనున్నారు గవర్నర్. రాష్ట్రపతి పర్యటనలో 30 నిముషాలు పాటు పాల్గొననున్నారు సీఎం జగన్. రేపు ఉదయం 10.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి చేరుకోనున్నారు జగన్. రాష్ట్రపతికి స్వాగతం పలికిన అనంతరం తిరిగి విజయవాడకు బల్దేరుతారు జగన్. ఈ పర్యటనకు డిప్యూటి సీఎం నారాయణ స్వామి,మంత్రి గౌతమ్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున వెళ్లనున్నారు.
previous post
next post
ఇసుక విధానంపై ప్రభుత్వం తన వైఖరిని స్పష్టం చేయాలి: పురంధేశ్వరి