telugu navyamedia
క్రీడలు వార్తలు

కోహ్లీ అప్పటివరకు రిటైర్ కాడు : హర్భజన్

క్రికెట్ లో భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఎంతటి గొప్ప బ్యాట్స్‌మనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విరాట్ గొప్ప కెప్టెన్‌ కూడా. ఎంఎస్ ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న అనంతరం ఐదేళ్లుగా టెస్టుల్లో.. మూడేళ్లుగా వన్డే, టీ20ల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియాను అత్యుత్తమంగా ముందుకు తీసుకెళుతున్నాడు. తడి కెరీర్‌లో ఇప్పటివరకూ ఓ లోటు మాత్రం అలానే ఉండిపోయింది. అదే ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడం. 2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ సందర్భంగా తొలిసారి ఆ అవకాశాన్ని కోల్పోయిన కోహ్లీ.. గతేడాది 2019 వన్డే ప్రపంచకప్ రూపంలో మరోసారి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అయితే త్వరలోనే కోహ్లీ ఐసీసీ ట్రోఫీ సాధిస్తాడని టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ హర్భజన్‌ సింగ్‌ జోస్యం చెప్పాడు. హర్భజన్‌ సింగ్‌ తాజాగా మాట్లాడుతూ… కోహ్లి చాలా గొప్ప ఆటగాడు. అతను ఎంత గొప్ప ఆటగాడు అనేది ఇప్పటికే చాలా సార్లు నిరూపించుకున్నాడు. ఇక ప్రపంచకప్ ను సాధించి తన కలను పరిపూర్ణం చేసుకుంటాడు. బహుశా వచ్చే ఏడాది కోహ్లి ఆ ఘనతను అందుకుంటాడని భావిస్తున్నాను.. ప్రస్తుతం ఉన్న జట్టును చూస్తుంటే కోహ్లి ఆ ఘనతను అందుకోవడం పెద్ద విషయమేమీ కాదని అనిపిస్తుంది. అయితే కోహ్లి ఏదో ఒక టైటిల్‌ సాధించకుండా మాత్రం రిటైర్‌ కాబోడని హర్భజన్ తెలిపాడు.

Related posts