telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఉద్యోగులను ఒత్తిడికి గురి చేసేలా ఎన్నికలకు వెళ్లడం సరికాదు..

స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం ఏపీలో మరింత హాట్‌టాపిక్‌గా మారిపోయింది. తాజాగా… స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహరంలో జగన్‌ ప్రభుత్వానికి ఏపీ హైకోర్టు షాకిచ్చింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో దాఖలైన రిట్‌ పిటిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే.. ఈ తీర్పుపై ఏపీ ప్రభుత్వ ఉద్సోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి స్పందించారు.  పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంలో సవాల్ చేస్తామని  వెంకట్రామిరెడ్డి అన్నారు. ఎన్నికలు ఇప్పటికిప్పుడు నిర్వహించకుంటే కొంపలు మునగవని ఫైర్‌ అయ్యారు. మేం ఆశించిన విధంగా హైకోర్టు తీర్పు లేదని… ఉద్యోగుల్లో కరోనా భయం ఉందని పేర్కొన్నారు. 11 వేల మందికి పైగా పోలీసులు కరోనా బారిన పడ్డారని… కరోనా భయంతో చాలా మంది ఉద్యోగులు సెలవుల్లో ఉన్నారని తెలిపారు. ఉద్యోగులను ఒత్తిడికి గురి చేసేలా ఎన్నికలకు వెళ్లడం సరికాదని…. వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయ్యేంత వరకు ఎన్నికల ప్రక్రియ ఆపాలని కోరారు. రెండేళ్ల నుంచి ప్రత్యేక అధికారుల పాలనే ఉందని… ఇప్పుడు ఉద్యోగులను వేధించాల్సిన అవసరం ఏముంది..? అని ప్రశ్నించారు.

Related posts