telugu navyamedia
సినిమా వార్తలు

లీకైన ‘సలార్’ వీడియో వైర‌ల్ ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా న‌టిస్తున్న‌ ‘సలార్’ సినిమా షూటింగ్ జ‌రుగుతుంది. ఈ నేప‌థ్యంలోన‌ షూటింగ్ లొకేషన్ నుంచి లీకైన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘కేజీఎఫ్’ లాంటి సెన్సేషనల్ సినిమాను రూపొందించిన దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇక తాజాగా ఈ సినిమా సెట్స్ నుండి ఓ వీడియో బయటకు వచ్చింది. ఇందులో ప్రభాస్ క్యాజువల్ గా బ్రౌన్ టీ షర్ట్, జీన్స్ ప్యాంటులో నడిచొస్తున్నాడు. ఆ వెనకే మేకప్ మ్యాన్, అసిస్టెంట్స్, యూనిట్ స్టాఫ్ ప్రభాస్‌ను అనుసరిస్తుండటం గమనించవచ్చు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ వీడియోను ఆ ఫోటోలు చూసి పండగ చేసుకుంటున్నారు. .Prabhas Video Leaked From Salaar Movie sets

శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని సరికొత్త అవతారంలో ప్రభాస్ ను చూపించబోతున్నారు.

Related posts