telugu navyamedia
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య‌ ‘థ్యాంక్​ యూ’ మూవీ ఆప్డేట్‌..రిలీజ్ అప్పుడే

అక్కినేని నాగ చైతన్య హీరోగా నటిస్తున్న చిత్రం ‘థ్యాంక్‌ యూ’. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న‌ ఈ మూవీలో రాశి ఖన్నా, అవికాగోర్‌,మాళవిక నాయర్‌ హీరోయిన్లు గా నటిస్తున్నారు. నాగ చైతన్య మూడు భిన్నమైన లుక్స్‌తో అల‌రించ‌నున్నాడు.

ఇటీవల రిలీజ్ అయిన ఈ మూవీ సాంగ్స్, టీజర్ మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుని మూవీ ఫై బాగా అంచనాలు క్రియేట్ చేసాయి.తాజాగా విభిన్న ప్రేమకథగా చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ సినిమా విడుదల తేదీ ఖరారైంది. జులై 22న ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ మేరకు చిత్రబృందం ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేసింది.Karthikeya 2 movie trailor thank you release date

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ మూవీకి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తుండ‌గా.. పీసీ శ్రీరామ్‌ ఛాయాగ్రహకుడుగా పనిచేస్తున్నారు.

Related posts