గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా గత ఏడాది అమెరికాకు చెందిన ప్రముఖ పాప్‌సింగర్ నిక్ జొనాస్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగి… హాలీవుడ్‌లోనూ క్వాంటికో సిరీస్‌లో ప్రతిభ చాటి తనేంటో ప్రపంచానికి తెలియజేసింది. బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా 2017లో వచ్చిన బేవాచ్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందిన విషయం తెలిసిందే. బేవాచ్ తర్వాత కూడా పలు హాలీవుడ్ సినిమాలు చేసిన ఈ అమ్మడు ఇటీవల “స్కై ఈజ్ పింక్” అనే హిందీ చిత్రంలో నటించింది. ప్రస్తుతం ‘వి కెన్ బి హీరోస్’ అనే హాలీవుడ్ మూవీలో నటిస్తుంది. హాలీవుడ్‌లో జరిగే ఈవెంట్స్‌కు భర్తతో కలిసి హాజరవుతూ ఉంది. ఈ క్రమంలో గ్రామీ అవార్డ్స్ 2020కి ఫంక్షన్‌కు హాజరైంది ప్రియాంక. అంతా బానే ఉంది కానీ.. ఆమె వేసుకున్న డ్రెస్ కారణంగా ఆమె విమర్శలను ఎదుర్కొనక తప్పడం లేదు. ఛాతీ భాగం ఎక్కువగా కనపడేలా ప్రియాంక చోప్రా వేసుకున్న బట్టలున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూసిన నెటిజన్స్ ఇండియాను ప్రెజంట్ చేస్తున్న ప్రియాంక ఇలాంటి డ్రెస్ వేసుకోవడంఫై నెటిజెన్స్ ట్రోలింగ్ మొదలు పెట్టారు.
previous post
next post
నాగబాబు కామెంట్-3: కన్నతండ్రిని వెన్నుపోటు పొడిచిన వ్యక్తి