telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక నియంత

ponnam prabhakar fire on ktr

జోగులాంబ గద్వాల్ జిల్లాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న రైతు వ్యతిరేక వ్యవసాయ విధానాలు, చట్టాలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన రైతులసంతకాల సేకరణ కార్యక్రమంలో పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులో మార్పులు చేయాలని రాహుల్ గాంధీ గారు రైతుల పక్షాన విజ్ఞప్తి చేస్తే కేంద్ర ప్రభుత్వ నాయకులు పట్టించుకోవడం లేదన్నారు. ఇక్కడ వడ్డేపల్లి మండలం రామాపురం గ్రామం లో పండించిన పంటలు దేశంలో ఎక్కడైనా పండించిన పంటలు రైతు ఎక్కడైనా అమ్ముకునే అవకాశం కల్పించినట్టే మద్దతు ధరలు కూడా బెంచ్మార్క్ పైకి నిర్ణయించి MSP ధరల పైనే కొనుగోలు అమ్మకాలు జరిగేలా మార్పులు చేయాలని కోరామని తెలిపారు.
దేశంలో పంజాబ్, హర్యానా రాష్ట్రంలో రైతులు ఆధునిక వ్యవసాయ విధానాలతో చైతన్యవంతంగా ఉన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ విధానాలను ఈ రెండు రాష్ట్రాలు మొదటగా వ్యతిరేకించాయి. బీజేపీతో పొత్తు తో ఉన్న శిరోమణి అకాలీదళ్ పార్టీకి చెందిన నేత హర్సిమ్రత్ కౌర్ తన మంత్రి పదవికి రాజీనామా చేసి ఈ కొత్త బిల్లుకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారన్నారు. కేంద్రం ఇటీవలే ప్రవేశపెట్టిన కొత్త వ్యవసాయ చట్టాలను తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ , రాజస్థాన్ రాష్ట్రాలలో మాదిరిగా ఈ బిల్లును వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ గారు లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని రెండు ఏళ్ళు గడిచినా ఇంతవరకూ రైతులకు రుణమాఫీ జరగలేదని ఫైర్ అయ్యారు. ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక నియంతలా మారి తను చెప్పిందే రాష్ట్రంలో జరగాలి అనే ఒక భ్రమ లో ఉండి మొక్కజొన్న పంటలను ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయదని మండిపడ్డారు.

Related posts