telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

కరోనా‌ వల్లే ఈ పరిస్థితి : జేడీయూ నేత

ప్రస్తుతం వెలువడుతున్న బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు క్షణం క్షణం ఉత్కంఠరేపుతున్నాయి.. మొదట్లో ఆర్జేడీ కూటమి ముందజాలో ఉన్నా.. ఆ తర్వాత అనూహ్యంగా పరిణామాలు మారిపోయి… జేడీయూ కూటమి లీడ్‌లోకి వచ్చింది… మ్యాజిక్‌ ఫిగర్‌ను కూడా దాటేసి.. ఆ కూటిమి అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.. అయితే, ఈ ఫలితాల్లో బీజేపీ పుంజుకోగా.. సీఎం నితీష్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూ మాత్రం ఘోరంగా దెబ్బతింది. ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది… ఇక, అధికార జేడీయూ తన ఓటమిని అంగీకరించినట్లే కన్పిస్తోంది. ఆర్జేడీ తర్వాత బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతుండగా… జేడీయూ మూడో స్థానానికి పరిమితమైంది.. తాజా ఫలితాలపై ఆ పార్టీ సీనియర్ నేత కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీహార్‌లో ఈ పరిస్థితి కారణం.. కరోనావైరసే కారణం అని వ్యాఖ్యానించారు త్యాగి. ఎన్నికలపై ఫలితాలపై స్పందించిన ఆయన.. లోక్‌సభ ఎన్నికల్లో ఆర్జేడీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది.. ఆ ఫలితాలను బట్టి చూస్తే జేడీయూ, మిత్రపక్షం కలిసి 200లకు పైగా సీట్లలో గెలవాలి.. కానీ, కోవిడ్‌ 19 ప్రభావం వల్లే మేం ఓడిపోతున్నాం.. అంతేగానీ ఆర్జేడీ వల్ల కాదు అంటూ వ్యాఖ్యానించారు. ఆర్జేడీ బ్రాండ్‌ ఏం పెరగలేదు.. నితీష్‌ కుమార్‌ పేరు ఏమీ తగ్గలేదు అని త్యాగి అన్నారు. 

Related posts