telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నిమజ్జన ఉత్సవంలో .. ఆంతర్యం ఇదే తెలుసా..

6 children died in ganesh utsav bangalore

పండగ రాగానే ఆయా దేవతల మండపాలు ఏర్పాటు చేస్తున్నారు. నిర్ణిత రోజులు పూజలు చేసి, నిమజ్జనం చేస్తున్నారు. ఇంతకీ ఈ నిమజ్జనం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలుసా.. పెద్దలు ఇలాంటి వేడుకలు ఊరికినే పెట్టరు కదా. ఆ ఆంతర్యంలో రహస్యం ఏమిలేదు, పెద్దలు చెప్పింది ఒక్కటే, ప్రకృతిని కాపాడుకుంటూ వస్తే, మనలను అది కాపాడుతుంది. ఎందుకంటే, ప్రతి జీవి తనకు కావాల్సిన ప్రతిదీ ప్రకృతి నుండే పొందుతుంది. ఇక వినాయక చవితి వచ్చిందంటే మన దగ్గర బోలెడు విగ్రహాలను నెలకొల్పుతారు. ఈ ఏడాది ఒక్క తెలంగాణలోనే లక్షకు పైగా విగ్రహాలను నెలకొల్పారు. ఇప్పటికే ఇందులో దాదాపు 50వేలకు పైగా విగ్రహాలను నిమర్జనం చేసినట్టు తెలంగాణ డిజిపి మహేందర్ రెడ్డి పేర్కొన్న సంగతి తెలిసిందే. నేటి రాత్రి వరకు నిమర్జనం పూర్తి చేస్తారు. ఖైరతాబాద్ నిమర్జనంతో చాలా వరకు నిమర్జనం పూర్తవుతుంది. నిమర్జనం కోసం ప్రభుత్వం దాదాపు 20 కోట్ల రూపాయలు కేటాయించింది. అసలు వినాయకుడిని ఎందుకు నిమర్జనం చేస్తారు. దానికి వెనుక రహస్యం ఏంటి.. తెలుసుకుందాం. ఒకప్పుడు వినాయకుడి విగ్రహాలను బంకమట్టితో చేసేవారు. 9 రోజులపాటు ఆ విగ్రహాలకు పూజలు చేసి.. ఊరెరిగింపుగా తీసుకెళ్లి ఊర్లో ఉన్న చెరువుల్లో నిమర్జనం చేసేవారు.

ఇలా నిమర్జనం చేయడం వలన విగ్రహం ఆ నీళ్లలో కరుగుతుంది. బంకమట్టి అడుగుకు చేరి అక్కడ భూమిపై లేయర్ గా ఏర్పడుతుంది. ఆలా విగ్రహాలను నీళ్లలో నిమర్జనం చేయడం ద్వారా బంకమట్టి ఒక పూతలా ఏర్పడి.. పైన ఉన్న నీళ్లు భూమిలోకి ఎక్కువగా ఇంకిపోకుండా చూస్తుంది. ఫలితంగా ఆ నీళ్లు ఎక్కువరోజులు చెరువులో ఉండటానికి ఆస్కారం ఉంటుంది. వాటిని పంట పొలాల కోసం ఉపయోగించుకుంటారు. వర్షం కురిసే రోజులు కాబట్టి ఇలా వర్షం వలన చెరువులు నిండుతాయి. త్వరగా నీరు ఇంకిపోకుండా ఉంటుంది. వివిధరకాల అవసరాలకు చెరువులోని నీటిని వినియోగించుకుంటారు. కానీ, ఇప్పుడు బంకమట్టితో తయారు చేసిన విగ్రహాలు చాలా తక్కువ. అన్నీకూడా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో, వివిధ రసాయనాలతో తయారు చేస్తున్నారు. ఇలా వాటిని తయారు చేయడం వలన నీళ్లు కలుషితం అవుతున్నాయి. హుస్సేన్ సాగర్ లో వేలాది విగ్రహాల నిమర్జనం కారణంగా ఆ నీళ్లలో ఉండాల్సిన జీవజాతుల్లో ఎప్పుడో నశించిపోయాయి. ఇప్పుడు ఎందుకు వినియోగించుకోలేని నీరు తప్ప మరేమి కనిపించడం లేదు.

Related posts