telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు.. విజయవాడలో సెంచరీ కొట్టిన పెట్రోల్ రేటు..

petrol bunk

కరోనా.. ప్రస్తుతం మన దేశాన్ని అతలాకుతలం చేస్తోంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మన దేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. అయితే తాజాగా దేశవ్యాప్తంగా మరోసారి డీజిల్‌, పెట్రోలు ధరలు పెరిగిపోయాయి. రోజువారీ సమీక్షలో భాగంగా లీటర్‌ పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 26 పైసల మేర పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 93.94 కి చేరింది. అలాగే డీజిల్‌ ధర రూ. 84.89 కు పెరిగింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సెంచరీకి చేరింది. ముంబైలో పెట్రోల్‌ ధర రూ. 100.19 , డీజిల్‌ రూ. 92.17 కి చేరాయి. ఇక హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.97.63 గా ఉండగా.. డీజిల్‌ ధర రూ. 92.54 కి చేరింది.ఇటు ఏపీలోని కొన్ని జిల్లాల్లో పెట్రోల్ ధరలు సెంచరీ కొట్టిన సంగతి తెలిసిందే. విజయవాడ విషయానికి వస్తే లీటర్ పెట్రోల్ ధర రూ. 100.11గా నమోదైంది.

Related posts