telugu navyamedia
సినిమా వార్తలు

శివశంకర్ మాస్టర్ మృతిపై పవన్ సంతాపం..

టాలీవుడ్ ప్రముఖ డ్యాన్స్ మాస్టర్ శివశంకర్ మాస్టర్ మృతిపై ప‌లువురు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. శివశంకర్ మాస్టర్ మరణం బాధాకరమని, కరోనా కారణంగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకుంటారని భావించానని జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ సంతాపం వ్యక్తం చేశారు.

ఈ మేరకు ట్విట్టర్ వేదిక‌గా ఓ లేఖను విడుదల చేశారు. శాస్త్రీయ నృత్యంలో పట్టు ఉన్న ఆయన సినీ నృత్యంలో ఆ పరిజ్ఞానాన్ని మేళవించారని కొనియాడారు. ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు.

టాలీవుడ్ లో తీవ్ర విషాదం.. చికిత్స పొందుతూ శివశంకర్ మాస్టర్ మృతి.. 1000  సినిమాలకు! | tollywood choreographer Shiva Shankar Master Passes Away -  Telugu Filmibeat

రామ్‌చరణ్ మగధీరలో శివశంకర్ మాస్టర్ నృత్యరీతులు అందించిన పాట ప్రేక్షకులకు సంతోషాన్ని ఇవ్వడమే కాక ఆయనకు జాతీయ పురస్కారాన్ని అందించడం గొప్ప విషయమన్నారు. శివశంకర్ మాస్టర్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నానని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు లేఖలో పవన్ పేర్కొన్నారు.

Image

Related posts