telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్‌బాగ్ నుంచి యాంక‌ర్ ర‌వి ఎలిమినేటెడ్‌..

తెలుగులో బిగ్‌బాస్-5 సీజన్ ఆసక్తికరంగా సాగుతోంది. బిగ్‌బాస్‌ హౌజ్‌లో ఇప్పటి వరకు గొడవలు, గోలలు, ఏడుపులు, ఎమోషన్స్‌తో సాగుతోన్న 12వ వారం ఉహించ‌ని విధంగా ఎలిమినేషన్ జ‌రిగింది.

బిగ్‌బాస్ హౌస్‌లో మొదటి నుంచి స్ట్రాంట్‌ కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న రవి హౌజ్‌ నుంచి బ‌య‌ట‌కు రావ‌డంతో ఒక్కసారిగా ఫ్యాన్స్‌ షాక్‌ అయ్యారు. రవినే బిగ్‌బాస్‌ విన్నర్‌గా ఊహించుకున్న అభిమానులు ఇప్పుడు అతను ఎలిమినేట్‌ అవ్వడంతో జీర్ణించుకోలేకపోతున్నారు.

ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నవారిలో సిరి లేదా కాజల్ లేదా ప్రియాంక ఎలిమినేట్ అవుతారని బిగ్‌బాస్ అభిమానులు లెక్కలు వేసుకున్నారు. అయితే వారి అంచనాలు తలకిందులు అయ్యాయి.

BBT5: Is Ravi The Favourite Contestant Of Bigg Boss?

దీంతో కొందరు అభిమానులు బిగ్‌ బాస్‌ హౌజ్‌ వద్ద నిరసనకు దిగారు. యాంకర్‌ రవికి అన్యాయం జరిగిందంటూ ఆరోపిణిస్తున్నారు. అసలు ఎవరికి ఎన్ని ఓట్లు పడ్డాయో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్‌ గేట్‌ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఫ్యాన్స్‌ పెద్ద ఎత్తున రోడ్డు మీదకు రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. తెలంగాణ జాగృతి సభ్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి రవి గేమ్ ఒక్కసారి చూసినట్లయితే, ఈసీజన్ కి వన్ ఆఫ్ ద హైలెట్ పార్టిసిపెంట్ రవినే అని చెప్పాలి. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగాడు. ముఖ్యంగా నాలుగైదు వారాలు రవి గ్రాఫ్ ఒక రేంజ్ లో పెరిగింది. టాస్క్ లలో తన పెర్ఫామెన్స్ తోనే ఆడియన్స్ కి బాగా క్లోజ్ అయ్యాడు. అసలు నిజంగా రవికి తక్కువ ఓట్లు వచ్చే ఎలిమినేట్ అయ్యాడా..? లేదా వేరే ఏదైనా రీజన్స్ తో రవిని పంపించేశారా అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Bigg Boss 5: Anchor Ravi Apologies

తాజా పరిణామాలతో కాజల్, రవి చివరి రెండు స్థానాల్లో నిలిచారని.. కాజల్‌కు అతడి స్నేహితుడు సన్నీ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడటంతో కాజల్ సేవ్ అయిందని.. రవి ఎలిమినేట్ అయ్యాడని సమాచారం. రవి ఎలిమినేట్‌ అవ్వడంతో బిగ్‌బాస్‌ విన్నర్‌గా ఎవరు నిలుస్తారనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Related posts