telugu navyamedia
ఆంధ్ర వార్తలు

పొత్తుల‌పై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్..

*బీజేపీ నాయ‌కులు ఇచ్చే రోడ్డు మ్యాప్ కోసం ఎదురుచూస్తున్న‌..
*ఎన్నికలు వచ్చినాకనే పార్టీ పొత్తులకు గురించి ఆలోచిస్తాం.
*వచ్చే ఎన్నికల్లో పొత్తులపై క్లారిటీ ఇచ్చిన పవన్‌

*వైసీపీని అధికారం నుంచి దించేంత వరకు శ్రమిస్తా..

వచ్చే ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్‌ క్లారిటీ ఇచ్చారు. జనసేన పార్టీ 9వ ఆవిర్భావ సభ గుంటూరు జిల్లా ఇప్పటంలో  జనసేన ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు.

 వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏం చేయాలనే దానిపై బీజేపీ పెద్దలు ఓ రోడ్ మ్యాప్ ఇస్తారని తనకు చెప్పారని.. దాని కోసం ఎదురుచూస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు ఉంటుందని పవన్‌ చెప్పకనే చెప్పారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీలు, వ్యక్తులు రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొస్తే.. పొత్తుల గురించి ఆలోచిస్తానని అన్నారు. రాష్ట్ర బాధ్యతను తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. జనసేన సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్ ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. 

వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడమే జనసేన పార్టీ టార్గెట్‌ అన్నారు పవన్‌ కల్యాణ్‌.. ప్రశ్నించడం అంటే మామూలు విషయం కాదన్న ఆయన… 2014లో సూటిగా ప్రశ్నించాం.. ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నాం.. 2019లో బలంగా పోరాటం చేశాం.. బరిలో నిలబడి ఉన్నాం.. 2024లో గట్టిగా నిలదొక్కుకుంటాం.. ప్రజా ప్రభుత్వాన్ని స్థాపిస్తామని ప్రకటించారు..

మొత్తానికి వైసీపీని ఓడించేందుకు టీడీపీ మరోసారి 2014 తరహా కూటమితో ముందుకు సాగుతుందా ? అన్న ప్రశ్నకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఓ సమాధానంగా మారుతాయా ? అన్నది చూడాలి.

Related posts