telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బెజవాడకు తెలంగాణ సీఎం కేసీఆర్..

తెలంగాణ సీఎం కేసీఆర్ బెజవాడకు వెళుతున్నారు. ఆయన దాదాపు మూడేళ్ల తర్వాత విజయవాడకు వెళుతున్నారు.మూడేళ్ళ క్రితం కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆహ్వానించేందుకు స్వయంగా విజయవాడ కు వచ్చిన కేసీఆర్ మరోసారి విజయవాడ రానున్నారు.

సీపీఐ జాతీయ మహాసభల్లో హాజరయ్యేందుకు సీఎం కేసీఆర్ విజయవాడ వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. సీపీఐ జాతీయ మహాసభలు వచ్చే నెల 14వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ విజయవాడలో జరగనున్నాయి.

ఇక ఈ మహా సభలకు తెలంగాణ ముఖ్యమంత్రితో పాటు తమిళనాడు సీఎం స్టాలిన్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, కేరళ సీఎం పినరయి విజయన్ లకు ఆహ్వానాలు అందాయి. వీరితో పాటు 20 దేశాలకు చెందిన కమ్యూనిస్ట్ నేతలకు ఆహ్వానం అందించారు సీపీఐ నేతలు. ఈ సభలో.. మోడీ సర్కార్‌ కు వ్యతిరేకంగా… కార్యచరణ రూపొందించనున్నారు.

ఇక ఈ సమావేశాలకు జాతీయ స్థాయి నేతలతో పాటు పలువురు ముఖ్యమంత్రులను కూడా ఆహ్వానించారు.అందులో భాగంగా తెలంగాణ,తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం పినరయి విజయన్, బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ లకు ఆహ్వానాలు అందాయి. వీరితో పాటు 20 దేశాలకు చెందిన కమ్యునిస్టు నేతలు కూడా హాజరుకానున్నారు. ఈ సభలో.. మోడీ సర్కార్‌ కు వ్యతిరేకంగా… కార్యచరణ రూపొందించనున్నారు.

ఇప్పటికే పలువురు ముఖ్యమంత్రులు కే వస్తామని హామీ ఇవ్వగా… మిగిలిన సీఎంల రాకపై మరో రెండు రోజుల్లో క్లారిటీ వస్తుందని సీపీఐ నేతలు చెబుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో కమ్యునిస్టులతో కలసి ప్రయాణం సాగించాలని కేసీఆర్ భావిస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికతో మొదలు పెట్టి సాధారణ ఎన్నికల వరకూ ఈ పొత్తును కొనసాగించాలన్నది ఆయన ఆలోచనగా ఉంది. అందువల్లనే కేసీఆర్ బెజవాడలో జరిగే సీపీఐ జాతీయ మహాసభలకు వెళ్లనున్నారని సమాచారం.

Related posts