telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైసీపీ నేతల్లో అధికార మదం పెరిగింది…

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఒక్కసారిగా వేడేక్కాయి. అధికార వైసీపీ వర్సెస్ జనసేన మధ్య మాటల తూటాలు పేలుతునన్నాయి. మంగళగిరిలో జనసేన విస్తృత స్థాయి సమావేశం అనంతరం ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పంచ్‌తోనే ప్ర‌సంగాన్ని మొద‌లు పెట్టారు..ఇంత‌కు ముందు లెక్క వేరు..ఇప్పటిలెక్క వేరు.! అన్నారు పవన్ కళ్యాణ్.. జనసైనికుల సింహ గర్జనలు. వైసీపీ గ్రామ సింహాల గోంకారాలు సహజమని మండిపడ్డారు.

కాకినాడ‌లో ఆరోజున వైకాపా కార్య‌క‌ర్త‌లు మా ఆడ బిడ్డ‌ల‌కు చేయి చేసుకున్నారు మేము మ‌ర్చిపోలేదు.ఎందుకంటే మేం తిట్ట‌లేదు. మీ నాయ‌కుడుని తిడితే మీరు ఊరుకొంట‌రా అని ప్ర‌శ్నించారు ప‌వ‌న్‌. ఎవ‌రు ఏం చేశారో ప్ర‌జాస్వామ్య ప‌ద్ద‌తిలో ఏవ‌రు ఏం చేశారో దానికి త‌గ్గ ప్ర‌తిఫ‌లం ఇవ్వ‌బ‌డుతుంద‌ని అన్నారు. చ‌ర్య‌కు ప్ర‌తి చ‌ర్య ఉంటుంది. వైకాపా ఇప్ప‌టిదాకా మాలాంటి వాళ్ళ‌ని చూడ‌లేద‌ని, భ‌య‌ప‌డే ప్ర‌శ‌క్తే లేదని అన్నారు.

వైసీపీ వ్యక్తులకు డబ్బు, అధికారం, అహకారం, మదం పెరిగిందని ఆరోపించారు. వారికి లేనిదల్లా భయం. భయం అంటే ఏమిటో నేను నేర్పిస్తానంటూ పవన్‌ హెచ్చరించారు. ఈ సన్నాసులకు, వారికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు నేర్పలేని సంస్కారం.. నేను నేర్పిస్తానంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తానన్నారు పవన్ కళ్యాణ్.

తాను పారిపోయే వ్యక్తిని కాదని, తాను మాటలు చెప్పే వ్యక్తిని కాదని, ప్రజా సేవకు అన్ని వదలుకుని వచ్చానని స్పష్టం చేశారు. తాను ఎప్పుడు ఏం అడిగినా ఏపీ గురించే అడుగుతానని చెప్పారు. టీడీపీకైనా బీజేపీకైనా ఏపీ కోసమే మద్దతు ఇచ్చా. కాట్ల కుక్కల్లా అరుస్తారేంటి.. మాట్లాడటం రాదా మీకు?. ఓ పని చేయండి.. ఇళ్లలోకి వచ్చి బంగారం కూడా లాగేసుకోండి.

నేను అడుగుతున్నది ఒకరి కష్టార్జితాన్ని మీరెవరు దోచుకోవడానికి అని అడిగా. నేను సినిమా టికెట్ల గురించి అడిగా నాకేమైనా థియేటర్లు ఉన్నాయా? వైసీపీ వారికే ఉన్నాయి. మహానుభావులకు తల వంచుతాం. మీలాంటి వారి తాట తీస్తాం. ఏదైనా అంటే అరుస్తారు.. మాట్లాడరు. ఏపీలో అభివృద్ధి లేదు. ఒక్క రోడ్డయినా వేశారా?’’ అని పవన్ ప్రశ్నించారు.

కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతానని పవన్‌ హెచ్చరించారు. తాను ఆడబిడ్డలకు చాలా గౌరవిస్తానని చెప్పారు. తన వ్యక్తిగత జీవితం బ్లాక్‌ అండ్‌ వైట్‌ అని పేర్కొన్నారు. గుంటూరు బాపట్లలో పుట్టిన వాడిని తనకు బూతులు రావా..? అని ప్రశ్నించారు. సాటి మనిషికి అన్యాయం జరిగితే స్పందించే గుణం తనదని, రాజకీయాల్లో ఉన్నాను కాబట్టి బూతులు మాట్లాడటం లేదని పవన్‌కల్యాణ్‌ అన్నారు.

అస‌లు చాలా సార్లు డ‌బ్బులు ఎలా వ‌స్తాయ‌ని అనేవారు. అయితే నేను పార్టీ స్టార్ చేసిన‌ప్పుడు కోటీ 65 ల‌క్ష‌లు మాత్ర‌మే ఉన్నాయి.. నేను ఏమి అనుకున్నాను అంటే పార్టీ పెట్టాలంటే వేళ కొద్ది డ‌బ్బులు కాదు ముఖ్యం ట‌న్నులు కొద్ది గుండె దైర్యం నా ద‌గ్గ‌ర ఉంది. అదే నా పెట్టుబ‌డి..ఒక అభిప్రాయాన్నిగంటాప‌దండా నిల‌బ‌డి చెప్ప‌గ‌ల‌ను.. దానికి ఏమీ ఆశించ‌ను కూడా ..జీవితంలో సాయుధ పోరాటానికి సిద్ధ‌మైన వాడిని నేను..వెన‌క్కి త‌గ్గే ప్ర‌శ‌క్తే లేదు.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో జ‌న సేన డంకా భ‌జాయించ‌డం ఖాయ‌మ‌ని,వైకాపాకి, వైకాపా నాయ‌క‌త్వానికి వ‌వ‌న్ క‌ళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా..బ‌య‌ట‌కి రా.. పెట్ట‌కుందాం రా..అంటూ జ‌గ‌న్‌కు స‌వాల్ విసిరారు ప‌వ‌న్‌. ఏం ప‌ర‌వాలేదు మీ తాట తీసి మోకాళ్ళ మీద కూర్చోపెడ‌తా జాగ్ర‌త్త‌. ఇక్క‌డ ఉన్న స్పీక‌ర్స్‌కూడా చెబుతా ఉన్నా జ‌న‌సేన స్పీక‌ర్స్‌గా చాలా మంది మీడియాకి వెళ్ళి బ‌లంగా మాట్లాడిండి. జ‌నసేన వైపు మాట్లాడితే తోలు తీస్తామ‌ని చెప్పండి..

యుద్దానికి మీరు పిలిచారు..నేను క‌వ్వించ‌లేదు.. ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా మీకు కింద కూర్చోబ‌ట్టి లొంగ‌దిస్తా అని ప‌వ‌న్ అన్నారు. మీకు యుద్దం సైజు ఎలా కావాలో కోరుకోండి..చాయిస్ ఈజ్ యువ‌ర్స్‌..జ‌న‌సేన అని గుర్తిపెట్టుకోండి. వైకాపా వాళ్ళ‌కి, వైకాపా నాయ‌క‌త్వానికి, వైకాపా మ‌ద్ద‌తుదారుల‌కు ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్ హెచ్చ‌రించారు.

Related posts