telugu navyamedia
ఆంధ్ర వార్తలు

వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ.. పవన్‌ కళ్యాణ్‌ ట్వీట్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్.. ఏపీ సర్కార్‌, సీఎం, మంత్రులపై చేసిన కామెంట్లు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. పవన్‌ కల్యాణ్‌ పై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడుతున్నారు మంత్రులు, వైసీపీ నేతలు. తాజాగా సినీ దర్శకనిర్మాణ, నటుడు పోసాని కృష్ణ మురళీ కూడా పవన్‌ కల్యాణ్‌పై తీవ్ర విమర్శలు చేశారు.

అయితే, సోషల్‌ మీడియా వేదికగా మంత్రి ఘాటుగా స్పందించారు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌. వైసీపీ నేతలను ఉద్దేశిస్తూ.. ఓ పద్యం రూపంలో… “తుమ్మెదల ఝుంకారాలు.. నెమళ్ళ క్రేంకారాలు.. ఏనుగుల ఘీంకారాలు.. వైసీపీ గ్రామసింహాల గోంకారాలు సహజమే…” అంటూ ట్వీట్‌ చేశారు.

అంతేకాక నాకు ఇష్టమైన పాటల్లో ఇది ఒకటి అంటూ.. “హూ లెట్ ది డాగ్స్ అవుట్” సాంగ్‌ లింక్‌ను షేర్‌ చేశారు పవన్‌ కల్యాణ్. ఆ ఒరిజినల్‌ వెర్షన్‌ పూర్తి సాంగ్‌ ఇదిగో అంటూ.. లింక్‌ షేర్‌ చేశారు.

 

Related posts