telugu navyamedia
క్రీడలు

పారాఒలింపిక్స్ అథ్లెట్లకు ప్రధాని మోడీ ఆతిథ్యం

ప్ర‌ధాని మోడీ ఈరోజు ఉద‌యం పారాఒలింపిక్స్ లో పాల్గొని ప‌త‌కాలు సాధించిన క్రీడాకారుల‌తో స‌మావేశం అయ్యారు. ప‌త‌కాలు సాధించిన వారికి ట్రీట్ ఇచ్చారు. వారితో క‌లిసి ఫోటోలు దిగారు. క్రీడ‌క‌ల‌కు అంగ‌వైక‌ల్యం అడ్డుకాద‌ని, దీనికి ఉదాహ‌ర‌ణ ప‌త‌కాలు సాధించిన క్రీడాకారులే అని ప్ర‌ధాని మోడీ ఈ సంద‌ర్బంగా పేర్కొన్నారు. ప‌త‌కాలు సాధించిన ప్ర‌తి ఒక్క‌రిని ప్ర‌ధాని ప‌ల‌క‌రించారు. ‘మీరు పడిన కష్టం వల్ల.. ఈ రోజు మీరు బాగా ప్రసిద్ది చెందారు. మీరందరూ ప్రజలను చైతన్యపరచగలరు. పెద్ద మార్పులు తీసుకురావడంలో సహాయపడగలరు… నేను ఎల్లప్పుడూ మీ అందరితో ఉంటాను’అని ప్రధాని మోడీ అథ్లెట్లతో అన్నారు.

ప్ర‌ధానిని క‌లిసినందుకు క్రీడాకారులు సంతోషం వ్య‌క్తం చేశారు. ప్రధాని తమతో కూర్చొని మాట్లాడటం, తమను ఆహ్వానించి అభినందించడం గౌరవంగా భావిస్తున్నామని అథ్లెట్లు అన్నారు. అలాగే పారా ఒలంపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లు.. వారి ఆటోగ్రాఫ్‌తో కూడిన పరికరాలను బహుమతిగా ఇచ్చారు. వీటిని తర్వాత వేలం వేయనున్నట్టుగా మోడీ చెప్పారు.

Related posts