telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్

క్రిస్ గేల్ ఖాతాలో.. మరో ప్రపంచ రికార్డు..

chris gale another world record

తొలి వన్డేలో విండీస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్ ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. 12 సిక్సర్లు బాది పట్టపగలే వారికి చుక్కలు చూపించాడు. 129 బంతుల్లో 135 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సిక్సర్ల వర్షం కురిపించిన గేల్ తన ఖాతాలో మరో రికార్డును వేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన క్రికెటర్‌గా చరిత్ర సృష్టించాడు.

గేల్ అన్ని పార్మాట్లలో కలిపి మొత్తం 444 మ్యాచ్‌లు ఆడగా 488 సిక్సర్లు నమోదు చేసి, ఈ జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. 476 సిక్సర్లతో ఇప్పటి వరకు ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్న పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిని వెనక్కి నెట్టేశాడు. మ్యాచ్‌ల పరంగా చూసుకుంటే.. గేల్ వన్డేల్లో 287 సిక్సర్లు, టెస్టుల్లో 98, టీ20ల్లో 103 సిక్సర్లు కొట్టాడు.

Related posts