telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

దక్షిణాఫ్రికాతో .. టెస్ట్ సమరం నేటి నుండే..

south africa test series from today In

విశాఖపట్టణంలో నేటి నుంచి దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు ఆరంభం కానుంది. గత టెస్టు సిరీస్‌లో భారత్ 3 – 0 తేడాతో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఉన్న స్థితిలో భారత్‌ను నిలువరించడం అసాధ్యమేనంటున్నారు క్రీడా విశ్లేషకులు. కెరీర్‌లో 28వ టెస్టులో తొలిసారి ఓపెనర్‌గా ఆడబోతున్న రోహిత్..రబడ, ఫిలాండర్ వేసే బంతులను ఎలా ఎదుర్కొంటాడనేది ఆసక్తికరంగా మారింది. మరో ఓపెనర్‌గా మయాంక్ అగర్వాల్ ఖాయమని తెలుస్తోంది. పుజారా, కోహ్లీ, రహానేలు తమ స్థాయికి తగ్గట్టుగా ఆడితే భారత్ భారీ స్కోరు చేయడం ఖాయంగా అనిపిస్తోంది. విండీస్‌లో సెంచరీ తర్వాత జోష్ మీదున్న తెలుగోడు హనుమ విహారీ కూడా సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నాడు. షమీ, ఇషాంత్ శర్మల రూపంలో ఇద్దరు పేసర్లున్నారు. అశ్విన్, జడేజా..లు తమ బాల్‌తో పనిపట్టేందుకు రెడీ అయ్యారు. వీరిని ఎదుర్కొవడం సౌతాఫ్రికా బ్యాట్స్ మెన్స్ కష్టమేనంటున్నారు.

దక్షిణాఫ్రికా విషయానికి వస్తే…అనుభవం లేని బ్రూయిన్, బవుమాలు జట్టును ఏ మాత్రం నిలబెడుతారనేది ఆసక్తికరంగా మారింది. డుప్లెసిస్ ఫాం కూడా అంతంత మాత్రంగానే ఉంది. భారత్ పిచ్‌లకు కొంత అలవాటు పడిన మార్క్‌రమ్ ఈ సిరిస్‌లో కీలకం కావచ్చు. ఈ జట్టు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతుందని తెలుస్తోంది. విశాఖ వేదికగా జరిగే తొలి టెస్టుపై వరుణుడు ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. టెస్టు జరిగే రోజుల్లో వాన పడవచ్చని వాతావరణ శాఖ అంటోంది. పూర్తిగా కాకపోయినా..అప్పుడప్పుడు అంతరాయం కలిగించవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసింది.

జట్ల వివరాలు :
భారతజట్టు : కోహ్లీ, రోహిత్ శర్మ, మయాంక్ అగర్వాల్, పుజారా, రహానే, విహారి, సాహా, అశ్విన్, జడేజా, ఇషాంత్, షమీ

దక్షిణాఫ్రికా జట్టు : డు ప్లెసిస్, మార్క్ రమ్, ఎల్గర్, బ్రూయిన్, బవుమా, డి.కాక్, ఫిలాండర్, కేశవ్, రబడ, ఇన్ గిడి, పీట్.

Related posts