telugu navyamedia
సినిమా వార్తలు

“ఓ లలనా!”

induvadana poetry corner
మన ప్రణయ పయోధిలో  మెరిసే 
జ్ఞాపకాల ముత్యాలు -అపారం
 ఆరు ఋతువుల్లో వైవిధ్య 
వాతావరణాల సుధాసారం – 
మన ప్రేమ మందిరం
ఒకే గూటి పక్షులం –
చిలుకా – గోరింకలం-
గురజాడ కలం లో 
ముత్యాలసరమా-
 జయదేవుని గానంలో
 అష్టపదులు సారమా-
కవి కాళిదాసు లేఖినిలో
 ప్రభవించిన ఊర్వశీ!
 అన్నమయ్య కీర్తనల్లో 
సౌందర్యరాశీ!
కవుల కలాల్లో 
ప్రేమ హృదయాల్లో
 ప్రవహించే నిత్య సత్యమే నీవు
 భువిని  బ్రతికించే ఆధారమే నీవు
ఓ లలనా! 
నా స్వరమా!
శివరంజనీ రాగమా!
 హంపి శిల్పమా!
 బాపు గీచిన చిత్రమా!
 రాయప్రోలు భావగీత మా!
 నీవే అనంతకోటి భాషల ఏకత్వానివి-
 నా అంతరంగ యవనికపై
 చెరగని ప్రేమ చిత్రానివి-
-మహేంద్రాడ సింహాచలాచార్య, 
టెక్కలి

Related posts