telugu navyamedia
సినిమా వార్తలు

ప్రో కబడ్డీలో వ్యాఖ్యాతగా నిత్యామీనన్

Nitya-Menon

ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌ బ్యానర్ పై బాలీవుడ్‌లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న చిత్రం “మిష‌న్ మంగ‌ళ్‌”. ఈ చిత్రం ప్రముఖ శాస్త్రవేత్త రాకేష్‌ ధావన్‌ జీవిత కథ ఆధారంగా రూపొందుతుంది. 2013లో భారత్‌ చేపట్టిన ‘మంగళ్‌యాన్‌‌’ మిషన్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. అక్ష‌య్ కుమార్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న ఈ చిత్రాన్ని జ‌గ‌న్ శ‌క్తి తెర‌కెక్కిస్తున్నారు. అక్షయ్‌ కుమార్‌ ఇందులో రాకేష్‌ పాత్ర పోషిస్తున్నారు. తాప్సీ, విద్యా బాలన్‌, సోనాక్షి సిన్హా, నిత్యా మేనన్‌, కీర్తి కుల్హరి, షర్మన్ జోషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే చిత్ర షూటింగ్ పూర్తి కాగా, ఆగ‌స్ట్ 15న సినిమా రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. భారతదేశం నుంచి అంగారకుడిపైకి పంపిన తొలి ఉపగ్రహం మంగళ్‌యాన్‌ కథ ఆధారంగా రాబోతున్న ఈ చిత్రం టీజర్, ట్రైలర్ ఇటీవలే విడుదల కాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. నిత్యామీనన్ విలక్షణమైన పాత్రలతో నటిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. తాజాగా ఈమె మరో కొత్త అవతారం ఎత్తారు. అది కూడా సినిమా రంగానికి పరిచయం లేని రంగంలో కావడం విశేషం. ఇంతకు నిత్యామీనన్ ఎత్తిన కొత్త అవతారం ఏంటో తెలుసా ? ప్రో కబడ్డీ కోసం ఆమె వ్యాఖ్యాతగా మారడమే. ఆగస్ట్ 15న `మిషన్ మంగల్` సినిమా విడుదలవుతుంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా యూనిట్ ప్రో కబడ్డీలో సందడి చేసింది. నటి విద్యాబాలన్‌తో కలిసి నిత్యామీనన్ వ్యాఖ్యాతగా వ్యవహరించింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. తెలుగు, తమిళ, కన్నడ భాషలల్లో నిత్యామీనన్ వ్యాఖ్యానం చేయడం విశేషం.

Related posts