telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఎవరూ నన్ను కలవడానికి రావొద్దు… మీ ఆరోగ్యం గురించి ఆలోచించడం నా బాధ్యత : బాలకృష్ణ

NBK

సినీ నటుడు నందమూరి బాలకృష్ణ జూన్‌ 10వ తేదీన 60వ పడిలోకి అడుగుపెడుతున్నారు. బుధవారం 60వ పుట్టినరోజు సందర్భంగా బాలకృష్ణ తన అభిమానులకు ఫేస్‌బుక్‌ ద్వారా విజ్ఞప్తి చేస్తూ..ఓ పోస్ట్‌ పెట్టారు. “ప్రపంచవ్యాప్తంగా ఉన్న నా అభిమాన సోదరులందరికీ ఆత్మీయ విజ్ఞప్తి. నా 60వ పుట్టినరోజుని మీ ఇంటి పండుగలా కనీ, వినీ ఎరుగని రీతిలో సంబరాలు చేస్తున్న అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో నా శ్రేయోభిలాషులు, కుటుంబసభ్యులైన మీ అందరితో వేడుకలు జరుపుకునేందుకు అవాంతరం ఏర్పడినందుకు బాధగా ఉంది. ఇలాంటి సమయంలో మీ అందరి ఆరోగ్యం గురించి ఆలోచించడం నా బాధ్యత. మీ అందరి క్షేమమే నాకు కొండంత ఆశీర్వాదమని బాలకృష్ణ పేర్కొన్నారు. మీరంతా మీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎవరూ నన్ను కలవడానికి రావొద్దని’ బాలకృష్ణ విజ్ఞప్తి చేశారు.

Related posts