telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

రేషన్ డెలివరీ వాహనాలను తనిఖీ చేసిన నిమ్మగడ్డ

ప్రస్తుతం ఏపీలో రాజకీయాలు మొత్తం పంచాయతీ ఎన్నికల చుట్టే తిరుగుతున్నాయి.  నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ వర్సెస్‌, వైసీపీగా ఏపీ పాలిటిక్స్‌ నడుస్తున్నాయి. అయితే.. వైసీపీ నేతలు ఎన్ని కామెంట్లు చేసినా… నిమ్మగడ్డ తగ్గడం లేదు. ఇది ఇలా ఉండగా… నిన్నటి  నుంచి ఏపీలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. అయితే తాజాగా.. పౌర సరఫరాల శాఖ రేషన్ డెలివరీ వాహనాలను తనిఖీ చేసారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ. హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆఫీసుకు రేషన్ డెలివరీ వాహనాలను పౌరసరఫరాల శాఖ అధికారులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా వాహనానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు నిమ్మగడ్జ. వెహికల్ కెపాసిటీ.. డెలివరీ విధానంపై ఎస్ఈసీ ఆరా తీశారు. వాహనాల తనిఖీ అనంతరం సివిల్ సప్లైస్ శాఖ అధికారులతో నిమ్మగడ్డ భేటీ నిర్వహించారు.

Related posts