telugu navyamedia
తెలంగాణ వార్తలు వార్తలు

తెలంగాణలో విద్యుత్ వాడకంలో కొత్త రికార్డు…

andhrapradesh 4th in solar power production

మన రాష్ట్రంలో వర్షాకాలంలో వర్షాలు ముంచెత్తాయి. చలి కాలంలో చలి పంజా విసిరింది. ఇక తాజాగా ఎండాకాలం వంతు వచ్చింది. ప్రస్తుతం ఇక్కడ ఇంటి నుండి బయటకు అడుగుపెట్టాలంటేనే వణికిపోయే పరిస్థితి వచ్చేస్తోంది.. దీంతో.. విద్యుత్ వినియోగం కూడా క్రమంగా పెరిగిపోతోంది… తెలంగాణలో ఈ రోజు ఆల్ టైమ్ హై రికార్డును సృష్టించింది విద్యుత్ డిమాండ్.. ఈ విషయాన్ని తెలంగాణ ట్రాన్స్‌కో అండ్ జెక్సో సీఎండీ ప్రభాకర్‌రావు ప్రకటించారు… ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా 13,688 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ రికార్డు అయినట్టు తెలిపారు.. ఇదే ఇప్పటి వరకు పీక్ డిమాండ్‌గా వెల్లడించారు.. ఇదే సమయంలో ఇంత పీక్ డిమాండ్ వచ్చినా విద్యుత్ సంస్థలు అధిగమించినట్టు ప్రకటించారు.. అంతేకాదు.. 15 వేల మెగావాట్ల విద్యుత్ డిమాండ్ వచ్చినా.. ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా చేస్తామని వెల్లడించారు ప్రభాకర్ రావు.. ఈ వేసవికాలంలో విద్యుత్ వినియోగం అధికంగా ఉండే అవకాశం ఉందని అంచనాలు వేశారు.

Related posts