telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

అత్యాచారాలకు అడ్డుకట్ట పడాలంటే ఉరిశిక్షలే మార్గం: జయప్రద

Jayaprada fire Ajamkhan comments

దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ అత్యాచార ఘటనపై సీనీ నటి జయప్రద స్పందించారు. షాద్ నగర్ ఘటనపై ఆమె తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటన పై ఆమె మాట్లాడుతూ ఆడబిడ్డలపై అత్యాచారాలు చేసేవాళ్లకు మరణశిక్షే సరైనదని అన్నారు. అయితే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా శిక్ష వేయాలని సూచించారు. ఘటన జరిగిన వెంటనే శిక్షలు అమలు చేయడం ద్వారా ఆ ప్రభావం తప్పకుండా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అత్యాచారాలకు అడ్డుకట్ట పడాలంటే ఉరిశిక్షలే మార్గమని పేర్కొన్నారు.

Related posts