ఏపీలో గత నాలుగు ఐదు నెలల నుండి వరుసగా ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అక్కడ ప్రస్తుతం తిరుపతి ఉప ఎన్నిక రగడ నడుస్తుంది. ఇక ఇదిలా ఉంటె… రేపు ఏపీ కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని ప్రమాణస్వీకారం చేయనుండగా.. ఆ వెంటనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేస్తారని తెలుస్తోంది.. ఇక, ఏప్రిల్ 8వ తేదీన పరిషత్ ఎన్నికలు జరగనుండగా… 10వ తేదీన కౌంటింగ్, ఫలితాల వెల్లడికి అవకాశం ఉన్నట్టుగా సమాచారం.. కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని ప్రమాణస్వీకారం చేసినవెంటనే… పెండింగ్ లో ఉన్న పరిషత్ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు ముగియగా.. ఇప్పుటుడు అందరి దృష్టి ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపైనే పడింది. కాగా, తన హయాంలో ఎన్నికలు నిర్వించలేకపోతున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఈ ఎన్నికల నోటిఫికేషన్ రేపు వస్తుందా… లేదా అనేది.
previous post