telugu navyamedia
క్రైమ్ వార్తలు వార్తలు

స్నేహితురాలికి గన్ చూపిస్తూ.. తనకు తాను కాల్చుకొని..!

gun fire

ఓ యువకుడు స్నేహితురాలికి గన్ చూపిస్తూ.. పొరపాటున తనకు తాను కాల్చుకొని గాయాలపాలయ్యాడు. ఈ ఘటన న్యూఢిల్లీ పరిధిలోని తిలక్ నగర్ లో జరిగింది. పోలీసులు వెల్లడించిన మరిన్ని వివరాల ప్రకారం, కాక్రోలా నివాసి అయిన సోనూ శర్మ, దీన్ దయాల్ ఉపాధ్యాయ్ ఆసుపత్రికి తుపాకి గాయంతో తన స్నేహితురాలు మేఘతో కలిసి వెళ్లాడు.

గుర్తు తెలియని వ్యక్తి తనను కాల్చాడని వైద్యులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆపై పోలీసుల విచారణలో మద్యం మత్తులో ఉన్న సోనూ శర్మ తనకు గన్ ను చూపిస్తూ పొరపాటున ట్రిగ్గర్ నొక్కాడని మేఘ పోలీసులకు వెల్లడించింది. ప్రమాదవశాత్తూ ఈ ఘటన జరిగిందని ఆమె పేర్కొంది. మేఘా స్టేట్ మెంట్ ను రికార్డు చేసి, కేసును విచారిస్తున్నామని తెలిపారు.

Related posts