నింగి లోన తారకవై నువ్వుంటే
చల్లని వెన్నెలై నే మెరావనా
మేఘ మాలికల పల్లకిలో నువ్వుంటే
చల్లని పవనమై నిన్ను చుట్టేయనా
హరివిల్లు పాన్పుపై నువ్వుంటే
మది నచ్చిన వర్ణమై కప్పేయనా
ఉరికే అలల ఉత్సాహం నువ్వైతే
ఓర్పుగ వేచే దరి నేనై తాకనా..
రేపటి ఆశల వసంతం నీవైతే
కమ్మని రాగమై నే పాడనా..
మది వెదురును స్పృశిస్తూ
నువ్వు సాగితే
హృదయమంతా
నిండిన నీ శ్వాసను రాగమై పలికించనా..
నిన్నటి జ్ఞాపకాల అలలపై నువ్వెటో సాగుతుంటే
కన్నీటి తెరచాప నెత్తి ఆవలి ఒడ్డుకు సాగుతున్నా..
అక్కడ నీ వుంటావన్న ఆశతో…
మనసు ముత్యాలను దోసిళ్ళ లో నింపుకొన్నా..
నిన్ను అభిషేకించుటకై…
అవధానం అమృత
9052912120
ప్రొద్దుటూరు