telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అనేక వార‌స‌త్వ క‌ట్ట‌డాల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిల‌యం -ద్రౌప‌తి ముర్ము

*ఆంధ్ర‌ప్ర‌దేశ్‌కు ఘ‌న‌మైన చ‌రిత్ర ఉంది
*తెలుగులో ప్ర‌సంగం ప్రారంభించిన ద్రౌప‌తి ముర్ము
*అనేక వార‌స‌త్వ క‌ట్ట‌డాల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్ నిల‌యం

ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల ప్రచారంలో ఈ రోజు ఏపీకి విచ్చేశారు. అనంతరం ద్రౌపది ముర్ము.. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.

ఓ కన్వెన్షన్ సెంటర్ లో నిర్వహించిన సమావేశంలో ద్రౌపది ముర్ముతో పాటు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌, కేంద్ర మంత్రి కిష‌న్‌రెడ్డి, బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు తో పాటు వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌కు ఘనమైన చరిత్ర ఉంది. ఎందరో మహనీయులు తెలుగు గడ్డపై జన్మించారు. ఈక్రమంలో తెలుగు కవులైన నన్నయ్య, తిక్కన, ఎర్రప్రగడలను ముర్ము స్మరించుకున్నారు.

తిరుపతి, లేపాక్షి వంటి ప్రసిద్ధ క్షేత్రాలకు ఏపీ నిలయం. స్వాతంత్ర్య సమరంలో ఏపీకి ఘన చర్రిత ఉంది. ఈ పోరాటంలో రాష్ట్ర మహనీయులు కీలక ప్రాత​ పోషించారు. ఉప్పు సత్యాగ్రహం, క్విట్‌ ఇండియా ఉద్యమంతో కీలక పాత్ర పోషించారు.

రాష్ట్రంలో ప్రకృతి సహజసిద్దమైన పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని అన్నారు. ఒడిశా, ఏపీ రాష్ట్రాలు ఇరుగు పొరుగు రాష్ట్రాలని ఆమె చెప్పారు.ఈ రెండు రాష్ట్రాల ప్రజల ఆహారపు అలవాట్లు, సంస్కృతి, సంప్రదాయాల్లో దగ్గరి పోలికలుంటాయని ఆమె చెప్పారు. తాను గిరిజన సంతతికి చెందినట్టుగా ఆమె ప్రస్తావించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న తెగ దేశంలో ఎక్కువ సంఖ్యలో ఉంటారని ఆమె గుర్తు చేశారు.

అనంత‌రం రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నందున తనకు మీ ఆశీర్వాదాలతో పాటు ఓటు వేసి గెలిపించాలని ద్రౌపది ముర్ము కోరారు.

Related posts