telugu navyamedia
రాజకీయ

రెండోరోజు ఈడీ విచారణకు రాహుల్‌ గాంధీ..ఢిల్లీలో ఏఐసీసీ కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త‌త‌

*ఈడీ కార్యాలయానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ
*నిన్న ప‌దిగంట‌ల పాటు ప‌శ్నించిన రాహుల్‌గాంధీ..
*నేష‌న‌ల్ హెరాల్డ్‌లో అవ‌క‌త‌వ‌క‌ల‌పై ప్ర‌శ్నించిన ఈడీ,,
*మ‌నీలాండ‌రింగ్ నిరోధ‌క చ‌ట్టం కింద వాగ్మూలం న‌మోదు..
*ఢిల్లీలో ఏఐసీసీ కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త‌త‌
*అడ్డుకున్న పోలీసుల‌తో నేత‌లు వాగ్వాదం
*ప‌లువురు ఎంపీల‌ను, నాయ‌కులు అరెస్ట్ చేసిన పోలీసులు

నేషనల్ హెరాల్డ్ మ‌నీలాండ‌రింగ్ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మంగళవారం రెండో రోజు ప్రశ్నించనుంది. ఈ కేసు  విచార‌ణ‌లో భాగంగా రెండో రోజు ఈడీ కార్యాలయానికి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేరుకున్నారు. రాహుల్‌ వెంట ప్రియాంక గాంధీ కూడా ఈడీ ఆఫీస్‌కు చేరుకున్నారు.

Rahul Gandhi left the ED office three hours later, came back; Inquiry begins – Marathi News | Rahul Gandhi came back to ED office after lunch break; Inquiry started on National Herald

అంతకముందు ఏఐసీసీ కార్యాలయం వద్ద రాహుల్‌ గాంధీ ధర్నాలో పాల్గొన్నారు. రాహుల్ వెంట  ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ర్యాలీగా బ‌య‌ల్ధేరారు. ముఖ్యనేతలనే ఏఐసీసీ కార్యాలయంలోకి పోలీసులు అనుమతిస్తున్నారు. ఇతర కాంగ్రెస్ నేతలను లోనికి వెళ్లనియకుండా అడ్డుకున్నారు. దీంతో ఉత్తమ్ కుమార్ రెడ్డి వెనుదిరగాల్సి వచ్చింది. అదేసమయంలో, మాన్ సింగ్ రోడ్ సర్కిల్​పై కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు

కాంగ్రెస్ కార్యకర్తలు పోలీసులతో బాహాబాహీకి దిగారు. ఆందోళన చేస్తున్న కొంతమంది కాంగ్రెస్ ఎంపీల‌తో స‌హా నాయ‌కుల‌ను ఢిల్లీ పోలీసులు నిర్బంధించారు. కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలాను సైతం అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఢిల్లీలో ఏఐసీసీ కార్యాల‌యం వ‌ద్ద ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణం చోటుచేసుకుంది. 

Rahul Gandhi quizzed by Enforcement Directorate for 11 hours, called again today in National Herald Case | India News - Times of India

కాగా ఈడీ సోమ‌వారం విచార‌ణ‌కు హాజ‌రైన రాహుల్‌గాంధీని ఈడీ దాదాపుగా 10గంట‌ల పాటు విచారించింది.విదేశీ బ్యాంక్ ఖాతాలు, ఆస్తులపై రాహుల్ ను ప్రశ్నించినట్లు తెలిసింది. దాదాపు యాభైకి పైగానే ప్రశ్నలు వ‌ర్షం కురిపించిన‌ట్లు చెబుతున్నారు. సోమ‌వారం ఉద‌యం ప్రారంభ‌మైన విచార‌ణ రాత్రి 11.10గంట‌ల‌కు ముగిసింది.

రెండో రోజు విచారణ కారణంగా కాంగ్రెస్‌ నిరసనలు కొనిసాగిస్తున్న నేపథ్యంలో ఢిల్లీలో ఆంక్షలు విధించారు. అక్బర్‌ రోడ్‌, జన్‌పథ్‌ మార్గాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల వద్ద కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళనలతో పోలీసులు అప్రమత్తమై  భారీగా మోహరించారు. 

Related posts