telugu navyamedia
రాజకీయ వార్తలు

మోదీ ప్రభుత్వం పని తీరుపై ప్రజల్లో పెరిగిన నమ్మకం!

narendra-modi

కరోనా కట్టడి కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొంటోందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడున్నట్టు ఓ సర్వేలో వెల్లడైంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు మార్చి 25వ తేదీన 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించిన కేంద్రం.. తర్వాత దాన్ని మే 3వ తేదీ వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. ఐఏఎన్‌ఎస్- సి- ఓటర్ కొవిడ్ 19 ట్రాకర్ సర్వే ప్రకారం.. లాక్‌డౌన్‌ మొదలైన తొలి రోజు మోదీ ప్రభుత్వంపై 78.6 శాతం ప్రజలు నమ్మకం వ్యక్తం చేశారు.

ఏప్రిల్ 21 నాటికి అది 93.5 శాతానికి పెరిగింది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 21 వరకు నిర్వహించిన ఈ సర్వేలో.. ‘కరోనా వైరస్‌ను భారత ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కుంటోందని నేను నేను భావిస్తున్నా’ అన్న స్టేట్‌మెంట్‌ను ప్రజల ముందుంచి వారి నుంచి సమధానాలు రాబట్టారు. ఏప్రిల్ 16వ తేదీన 75.8 శాతం ప్రజలు కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం ఉంచారు. కానీ, దేశంలో మరిన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడంతో ప్రభుత్వానికి మద్దతిచ్చే వారి శాతం ఒక్కసారిగా పెరిగింది.

Related posts