telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్!

modi on jammu and kashmir rule

ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా ఈ తెల్లవారుజామున హ్యాకైంది. ఈ మేరకు మోదీ వ్యక్తిగత ట్విట్టర్ ఖాతా హ్యాక్ కు గురైనట్టు ట్విట్టర్ నిర్ధారించింది. ఈ వ్య్వహారంపై దర్యాప్తు ప్రారంభించినట్టు ట్విట్టర్ ప్రతినిధులు తెలిపారు. మోదీ ట్విట్టర్ ఖాతా ఈ తెల్లవారుజామున 3.15 గంటల సమయంలో హ్యాక్ అయినట్టు వెల్లడించింది.

హ్యాక్ అయిన మోదీ ఖాతాకు 2.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. జులైలో పలువురు ప్రముఖుల ట్విట్టర్ ఖాతాలు హ్యాక్‌కు గురవడం సంచలనమైంది. ఆ తర్వాత ఇప్పుడు ఏకంగా మోదీ ట్విట్టర్ ఖాతా హ్యాక్ కావడం కలకలం రేపుతోంది. జులైలో హ్యాక్‌కు గురైన ట్విట్టర్ ఖాతాల్లో అమెరికా అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఉన్నారు.

Related posts