కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులను విపక్షాలతో పాటు తమ సంకీర్ణ ప్రభుత్వంలోని కొన్ని పార్టీలు కూడా కూడా వ్యతిరేకిస్తుండటం బీజేపీ సర్కారును ఇబ్బంది పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ వ్యవసాయ బిల్లులతో రైతులకు మేలు జరుగుతుందని అన్నారు.
రైతలుకు కనీస మద్దతు ధరను కల్పించేందుకు ఈ బిల్లులు తోడ్పడతాయని చెప్పారు. తమకు వస్తున్న సరికొత్త అవకాశాలను కొందరు వ్యతిరేకిస్తున్నారనే విషయాన్ని రైతులు గమనిస్తున్నారని చెప్పారు.
రైతుల కోసం తాము తెస్తున్న చట్టం చరిత్రాత్మకమని అన్నారు. రైతు సమస్యలను తప్పుదోవ పట్టించేవారి విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.రైతుల నుంచి గోధుమలు, బియ్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయదనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు.