telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

అసెంబ్లీలో టీడీపీ సభ్యుల పై సీఎం జగన్ నిప్పులు

ఏపీ అసెంబ్లీలో సమావేశాల్లో కీలక బిల్లులు ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ స్పీకర్ పోడియం వద్దకు వచ్చి టీడీపీ సభ్యులు నిరసన తెలిపారు. నామినేటెడ్ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషణ్లు కల్పిస్తూ ప్రవేశపెట్టిన బిల్లుపై టీడీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాగే పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు కల్పిస్తూ వైసీపీ బిల్లులు ప్రవేశపెడుతున్న సమయంలో టీడీపీ ఆందోళనకు దిగింది.

ఈ క్రమంలో ప్రతిపక్ష టీడీపీ పై సీఎం జగన్ నిప్పులు చెరిగారు. సభలో గందరగోళం చేయడానికి టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుందంటూ మండిపడ్డారు. బీసీలకు, ఎస్సీలకు మంచి జరుగుతుంటే టీడీపీ అడ్డుకోవాలని చూస్తుందన్నారు. చంద్రబాబు నాయుడు లాంటి ప్రతిపక్ష నాయకుడు దేశంలోనే ఎక్కడా ఉండబోరని విమర్శించారు.

Related posts