telugu navyamedia
వార్తలు

ఆ స్కాంలో మంత్రి జయరాం అసలు పాత్రధారుడు: బుద్ధా వెంకన్న

Budha venkanna

ఈఎస్ఐ స్కాం వెనుక అసలు పాత్రధారులు బయటపడ్డారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్విట్టర్ లో వెల్లడించారు. ఈఎస్ఐ స్కాంలో అసలు పాత్రధారుడు ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం అని ఆరోపించారు. మంత్రి జయరాం ఈఎస్ఐ స్కాంలో ఏ14 నిందితుడైన కార్తీక్ ను సొంత కొడుకులా భావించి అన్ని పనులు చేసిపెట్టాలని అధికారులను ఎందుకు ఆదేశించారని ప్రశ్నించారు.

తన శాఖలో అవినీతికి సహకరించని అధికారి ఉదయలక్ష్మిని శాఖ నుంచి తొలగించడానికి ఎందుకు ప్రయత్నించారని నిలదీశారు. కార్తీక్ కు బెయిల్ ఇప్పించమని మంత్రి జయరామ్ ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జలతో చేసిన పంచాయితీ ఏంటి? అని అడిగారు. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని, మంత్రి జయరామ్ దోచుకున్న కష్టజీవుల సొమ్ము వెనక్కి రాబట్టాలని డిమాండ్ చేశారు.

Related posts