telugu navyamedia
ఆంధ్ర వార్తలు

టెన్త్ విద్యార్ధుల‌తో నారా లోకేశ్ జూమ్ మీటింగ్‌ : వైసీపీ నేత‌లు వల్లభనేని, కొడాలి నాని ఏంట్రీ..

*నారా లోకేశ్ జూమ్ మీటింగ్‌లో వైసీపీ నేత‌లు వల్లభనేని, కొడాలి నాని ఏంట్రీ

*టెన్త్ విద్యార్ధుల‌తో జూమ్ మీటింగ్ పెట్టిన నారా లోకేష్‌
లోకేష్ జూమ్ మీటింగ్‌లో వైసీపీ నేత‌లు..
*జూమ్ మీటింగ్‌లో ఎందుకు డైరెక్ట్‌గా మాట్లాడ‌తాన‌న్న లోకేష్‌..
*త‌ప్పు దారి ప‌ట్టించేందుకు వైసీపీ నేత‌లు వ‌చ్చారు..
వంశీ ఆఫీస్‌లో ఉండి లాగిన్ అయిన ఓ విద్యార్ధి
*పొలిటిక‌ల్ ట‌ర్న్ తీసుకున్న లోకేష్ జూమ్ మీటింగ్
*జూమ్ మీటింగ్ వీడియో క‌ట్ చేసిన నిర్వ‌హాకులు..

పదో తరగతి విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులతో టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ జూమ్ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతుండ‌గా ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ జూమ్ మీటింగ్‌లో వైసీపీ నేత‌లు ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. 

ఇటీవల విడుదలైన పదో తరగతి పరీక్షల ఫలితాల పై తీవ్ర దుమారం రేగుతోంది. ఎక్కువ మంది ఫరీక్షల్లో ఫెయిల్ అవ్వడం.. కొందరు ఒక్కో మార్కు తేడాతో ఫెయిలై ఒత్తిడికి లోనవుతున్నారు. కొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

ఏపీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రెండు లక్షల మంది పరీక్షలు ఫెయిల్ కావడం ప్రభుత్వ అసమర్ధతే కారణమని.. విపక్షాలు ఆరోపిస్తున్నాయి.  ఈ నేపథ్యంలో పదో తరగతి విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జూమ్ మీటింగ్ నిర్వహించారు.. వారి సమస్యలను వింటూ.. అన్ని విధలా అండగా ఉంటామని.. ఎవరూ అధైర్య పడి మానసిక ఒత్తిడకి గురి కావొద్దని భరోసా ఇచ్చారు..

అయితే ఇదే సమయంలో జూమ్ మీటింగ్‌లో ఒక్కో విద్యార్థికి మాట్లాడే అవకాశం కల్పిస్తుండగా, ఓ విద్యార్థి వంతు రాగానే గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, కొడాలి నాని సహా కొందరు ఆ మీటింగ్‌లో ప్రత్యక్షం అయ్యారు.

Nara Lokesh Zoom meeting: Vallabhaneni vamsi, Kodali nani appears in Zoom meeting with tenth students

మరోవైపు విద్యార్థులలో విషం నింపవద్దని, బాగా చదివి పరీక్ష రాస్తే పాస్ అవుతారని, ప్రభుత్వం కావాలని ఎందుకు చేస్తుందని వైసీపీ యాక్టివిస్ట్ లోకేష్ ను ప్రశ్నించారు. ఈలోగా జూమ్ మీటింగ్ లోకి కొడాలి నాని, వల్లభనేని వంశీ మ‌ధ్య‌లో రావడంతో నిర్వాహకులు కాల్ కట్ చేశారు.

అనంతరం నారా లోకేశ్ మాట్లాడుతూ.. త‌ప్పు దారి ప‌ట్టించేందుకు వైసీపీ నేత‌లు మ‌ధ్య‌లో వ‌చ్చార‌ని, జూమ్ మీటింగ్‌లో ఎందుకిలా దొంగచాటుగా ఉన్నారని, డైరెక్ట్ గా వస్తే మాట్లాడతానని సవాలు విసిరారు.

కాగా..విద్యార్ధులకు పంపిన జూమ్ మీటింగ్ లింక్ ద్వారా మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు ప్రత్యక్షమయ్యారని టీడీపీ నేతలు అనుమానిస్తున్నారు. ఈ విషయమై టీడీపీ నేతలు విచారణ చేస్తున్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీలకు ఈ మీటింగ్ యాప్ లింక్ లు ఎవరిచ్చారనే విషయమై కూడా టీడీపీ వర్గాలు ఆరా తీస్తున్నాయి.కార్తీ కృష్ణ పేరుతో మాజీ మంత్రి కొండాలి నాని, నవ్య తోట పేరుతో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలు జూమ్ కాన్ఫరెన్స్ లోకి వచ్చారని టీడీపీ వర్గాలు గుర్తించాయి.

 

Related posts