ఏపీలో ఆర్థికశాఖలో పనిచేస్తున్న ముగ్గురు ఉద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇద్దరు ఆర్థికశాఖలో సెక్షన్ అధికారులు డి. శ్రీనుబాబు, కె. వరప్రసాద్ సహా అసిస్టెంట్ సెక్రటరీ వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి షంషేర్ సింగ్ రావత్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్థికశాఖలోని సమాచారం లీక్ చేస్తున్నారన్న అభియోగంపై ప్రభుత్వం వారిని సస్పెండ్ చేసింది. వేటు పడిన ముగ్గురూ ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్‌క్వార్టర్ విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు.
previous post