telugu navyamedia
క్రీడలు

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన లవ్లీనా

టోక్యో ఒలింపిక్స్ మ‌హిళ‌ల బాక్సింగ్‌లో ల‌వ్లీవా బొర్గొహెయిన్ చరిత్ర సృష్టించింది. కాంస్య‌ప‌త‌కం సాధించింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన భారత మూడో బాక్సర్‌గా లవ్లీనా నిలిచింది. సెమీస్‌లో ల‌వ్లీవా ట‌ర్కీకి చెందిన ప్ర‌పంచ చాంపియ‌న్ సుర్మెనెలి చేతిలో ఓట‌మిపాలైంది. మొత్తం 5 రౌండ్లలో కూడా సుర్మెనెలి ఆధిప‌త్యం కొన‌సాగించింది. దీంతో ల‌వ్లీనా సుర్మెనెలి చేతిలో 0-5 తేడాతో ఓడిపోయింది. టోక్యో ఒలింపిక్స్‌లో లవ్లీనాకు కాంస్యమే దక్కినా అది స్వర్ణంతో సమానం. ఎందుకంటే భారత బాక్సింగ్‌కు 9 ఏళ్ల తర్వాత ఆమె తొలి పతకం అందిస్తోంది. అంతర్జాతీయ బాక్సింగ్‌లో అంతగా అనుభవం లేని లవ్లీనా తొలిసారి ఒలింపిక్స్‌లో పాల్గొని పోడియంపై నిలబడి దేశానికి వన్నె తెచ్చింది. ఇప్ప‌టికే ఇండియా వెయిట్ లిఫ్టింగ్‌లో చాను ర‌జ‌తం, షటిల్‌లో పీవీసింధు కాంస్య‌ప‌త‌కాలు గెలుచుకున్నారు. దీంతో ఇండియా ఇప్ప‌టి వ‌ర‌కు ఈ ఒలింపిక్స్‌లో మూడు ప‌త‌కాలు సాధించింది.

Related posts