telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

అనిల్ కుంబ్లే అత్యుత్తమ కెప్టెన్..అభివర్ణించిన గంభీర్

Kumble Gambhir

టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లేపై మాజీ క్రికెటర్, బీజేపీ నేత గౌతమ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. తాను ఆడిన కాలంలో కుంబ్లేనే అత్యుత్తమ సారథి అని గంభీర్ అభివర్ణించాడు. కుంబ్లే భారత్ కు ఎక్కువకాలం కెప్టెన్ గా కొనసాగివుంటే సారథ్యానికి సంబంధించిన ప్రతి రికార్డు బద్దలయ్యేదని అన్నాడు.

కెప్టెన్ గా ఎంఎస్ ధోనీ అనేక ఘనతలు సాధించినా, కుంబ్లేనే బెస్ట్ అని భావిస్తానని తెలిపాడు. సౌరవ్ గంగూలీ కూడా ఎన్నో విజయాలు అందుకున్నా, భారత్ కు సుదీర్ఘకాలం కెప్టెన్ గా వ్యవహరించదగ్గ వ్యక్తిగా కుంబ్లేనే కోరుకుంటానని వెల్లడించాడు. కుంబ్లే సారథ్యంలో తాను 6 టెస్టులు ఆడానని గంభీర్ తెలిపాడు. లెగ్ స్పిన్నర్ గా ప్రపంచప్రఖ్యాతి గాంచిన కుంబ్లే 2007లో రాహుల్ ద్రావిడ్ నుంచి టీమిండియా పగ్గాలు అందుకున్నాడు.

Related posts